aadi pinishetty: యంగ్ హీరో ఆది పినిశెట్టి ఇక విలన్ వేషాలు వేయడట!

  • మొదట్లో హీరోగా చేసిన ఆది పినిశెట్టి 
  • ఆ తరువాత తగ్గిన అవకాశాలు 
  • మళ్లీ హీరోగా కొనసాగాలనే నిర్ణయం

హీరోగా విభిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆది పినిశెట్టి, ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. దాంతో నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు .. విలన్ పాత్రల వైపు మొగ్గు చూపాడు. ఆ తరహా పాత్రలు మంచి గుర్తింపు తీసుకురావడం .. ఆ సినిమాలు సక్సెస్ కావడం ఆయనకి బాగా కలిసొచ్చింది.

 దాంతో తెలుగు .. తమిళ భాషల్లో ఆయనకి అలాంటి పాత్రలే వస్తున్నాయి. ఇక ఆయన హీరోగా సినిమాలు చేయడానికి ముందుకువస్తోన్న దర్శక నిర్మాతల సంఖ్య కూడా పెరుగుతోందట. ఆయనతో జోడీ కట్టడానికి హీరోయిన్స్ ఆసక్తిని చూపుతుండటం విశేషం. దాంతో ఇక విలన్ వేషాలు ఆపేసి .. హీరోగానే చేయాలనే నిర్ణయానికి ఈ యంగ్ విలన్ వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.    

aadi pinishetty
Tollywood
  • Loading...

More Telugu News