heart: ఈ పని చేయండి.. మీ గుండెకు ఎంతో మేలు: రీసెర్చ్ రిపోర్ట్

  • రోజుకు మూడు కప్పుల కాఫీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది
  • గుండో ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలను తగ్గిస్తుంది
  • యూనివర్శిటీ ఆఫ్ సావో పౌలో అధ్యయనంలో వెల్లడి

ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని యూనివర్శిటీ ఆఫ్ సావో పౌలో శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాఫీని తీసుకోవడం ద్వారా గుండె జబ్బులను నియంత్రించవచ్చని తమ అధ్యయనంలో తేలిందని వారు తెలిపారు. 4,400 మందిపై వీరు అధ్యయనం చేశారు. వీరు తీసుకుంటున్న డైట్ ను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

రోజుకు మూడు కప్పుల కాఫీ తాగే వారిలో గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కాల్షియం నిల్వలు తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధనలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీని కారణంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతున్నట్టు గుర్తించామని వెల్లడించారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఇదే సమయంలో రోజుకు మూడు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ సేవించడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News