Saira: లీక్ ఎఫెక్ట్... 'సైరా' ఫోటోలను బయటపెట్టిన చిరంజీవి!

  • లీక్ అయిన 'సైరా' ఫోటో వైరల్
  • కొన్ని చిత్రాలను స్వయంగా విడుదల చేసిన చిరు
  • అమితాబ్ గెటప్ కూడా

తన కొత్త చిత్రం 'సైరా' కు సంబంధించిన ఓ స్టిల్ ఆన్ లైన్ లో లీక్ అయి వైరల్ అవుతున్న నేపథ్యంలో, అదే స్టిల్ కు సంబంధించిన ఒరిజినల్ ఫోటోతో పాటు, మరో రెడు ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులతో పంచుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా చిత్రం లీక్ కావడంతో, లీక్ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకే చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తన భార్య పాత్రధారి నయనతారతో కలసి యాగం పూర్తి చేసిన తరువాత ఆశీర్వదిస్తున్న పండితుల ఫోటోను చిరంజీవి విడుదల చేశారు. ఇందులో అమితాబ్ కూడా కనిపిస్తున్నారు. తొలుత లీక్ అయిన ఫోటో ఒరిజినల్ ను, అమితాబ్ గెటప్ ను రివీల్ చేశారు. వాటిని మీరూ చూడవచ్చు.

Saira
Amitabh Bachchan
Chiranjeevi
Nayanatara
  • Loading...

More Telugu News