Australia: 90 శాతం డిస్కౌంటన్నా ఎవరూ రావట్లేదు... స్టీవ్ స్మిత్ పరిస్థితి ఎలా ఉందో చెబుతున్న ఫోటో... వైరల్!
- బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన స్టీవ్
- 24 డాలర్లకు స్టీవ్ స్మిత్ స్వీయ చరిత్ర పుస్తకం
- డిమాండ్ లేక 2 డాలర్లకే ఆఫర్
దక్షిణాఫ్రికాతో క్రికెట్ ఆడుతూ విజయం కోసం అడ్డదారులు తొక్కి బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్ తల్లకిందులైంది. ఏడాది పాటు నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆయన పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఈ ఫోటో నిదర్శనంగా నిలుస్తోంది. కొంతకాలం క్రితం స్మిత్ తన స్వీయ కథను స్వయంగా రచించి, దానికి 'ది జర్నీ స్టీవ్ స్మిత్' అని పేరు పెట్టగా విశేషమైన స్పందన వచ్చింది.
దీని ధరను 24 డాలర్లుగా నిర్వహించగా, హాట్ కేక్ లా అమ్ముడుపోయింది. ప్రస్తుత పరిణామాలతో ఈ పుస్తకాన్ని కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోగా, క్లియరెన్స్ సేల్ పేరిట ఓ బుక్ షాప్ కేవలం 2 డాలర్లకే పుస్తకాన్ని ఇస్తామని ప్రకటిస్తూ తన షాపు ముందు బోర్డులు పెట్టింది. ఈ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 90 శాతం తగ్గింపు ధరకు బుక్ విక్రయిస్తామన్నా ఎవరూ కొనుగోలు చేయడం లేదని సమాచారం.