Chiranjeevi: చిరంజీవి, నయన్, అమితాబ్, బ్రహ్మాజీ... 'సైరా' లీక్ తో చిత్ర టీమ్ కు షాక్!

  • నెట్టింట లీక్ అయిన దృశ్యం
  • ఏదో యాగం చేస్తున్న చిరంజీవి, నయనతార
  • వెనుక అమితాబ్ బచ్చన్

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం 'సైరా'కు చెందిన ఓ ఫొటో లీక్ కావడం చిత్ర యూనిట్ ను షాక్ కు గురిచేసింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రను పోషిస్తున్న అమితాబ్ బచ్చన్ ఓ పీఠంపై కూర్చుని చూస్తుండగా, చిరంజీవి, నయనతారలు ఏదో యాగం చేస్తున్న దృశ్యమిది.

చుట్టూ వందలాది మంది ప్రజలు నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను ఎవరు తీశారో, ఎలా తీశారో తెలియదుగానీ, నెట్టింట మాత్రం హల్ చల్ చేస్తోంది. చిరంజీవి వైట్ అండ్ మెరూన్ డ్రస్ లో పొడవాటి జుట్టు, గడ్డంతో ఉండగా, నయనతార బంగారు వర్ణపు దుప్పట్టా, పసుపు చీరతో కూర్చుని ఉంది, వారి వెనుక అమితాబ్ కూర్చుని ఉన్నారు. మరో నటుడు బ్రహ్మాజీ కూడా చిరంజీవి జంట వెనుక నిలబడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని మీరూ చూడండి.

Chiranjeevi
Amitabh Bachchan
Saira
Nayanatara
  • Error fetching data: Network response was not ok

More Telugu News