Vijayawada: విజయవాడ మాజీ మునిసిపల్ కమిషనర్‌కు రెండు నెలల జైలు శిక్ష!

  • పుష్కరఘాట్ నిర్మాణం కోసం ఇళ్లను కూల్చవద్దంటూ హైకోర్టు ఆదేశాలు
  • బేఖాతరు చేసిన అప్పటి కమిషనర్ వీరపాండ్యన్
  • జైలు శిక్షతో పాటు పిటిషనర్లకు చెరో రూ. లక్ష చెల్లించాలని కోర్టు ఆదేశం

పుష్కరఘాట్ నిర్మాణం కోసం ఇళ్ల కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు విజయవాడ మాజీ మునిసిపల్ కమిషనర్, ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్‌కు హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అలాగే భవిష్యత్తులో విధి నిర్వహణలో జాగ్రత్తగా వుండాలని ఈ ఐఏఎస్ అధికారిని కోర్టు ఘాటుగా హెచ్చరించింది. ఈ కేసులో ఇద్దరు పిటిషనర్లకు సొంతంగా చెరో లక్ష రూపాయలు చెల్లించాలని కూడా వీరపాండ్యన్‌ను కోర్టు ఆదేశించింది. ఇదే కేసులో కృష్ణ లంక సీఐ చంద్రశేఖర్‌కు నెల రోజుల శిక్ష విధించింది.

పుష్కరాల సందర్భంగా నిర్మించ తలపెట్టిన పుష్కరఘాట్ కోసం ఇళ్ల కూల్చివేతను ఆపాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన కోర్టు ఇళ్ల కూల్చివేతను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, హై కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇళ్లు కూల్చివేసి పుష్కర ఘాట్‌ను నిర్మించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఈ శిక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News