shashi: మహవీర్‌ ఫొటోకి బదులు బుద్ధుడి ఫొటో పోస్ట్ చేసిన శశి థరూర్‌.. నెటిజన్ల విమర్శలు

  • జైనులకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్
  • బుద్ధుడు, మహవీర్‌లకి మధ్య తేడా కూడా తెలియదా? అంటూ నెటిజన్ల విమర్శలు
  • తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేసిన శశి థరూర్

కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ తన ట్విట్టర్ ఖాతాలో మహవీర్‌ జయంతి సందర్భంగా జైనులకు శుభాకాంక్షలు తెలుపుతూ మహవీర్ పొటోకి బదులు బుద్ధుడి ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయనకు నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు. బుద్ధుడికి, మహవీర్‌కి తేడా కూడా తెలియదా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై వస్తోన్న విమర్శలపై స్పందించిన శశి థరూర్ హుందాగా సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు.

తాను తప్పు చేయనని, ఒకవేళ చేస్తే ఒప్పుకుంటానని, అంతేగానీ సాక్ష్యాలు దాచిపెట్టనని అన్నారు. నిజాయతీగా ఉండటమే అన్నిటికన్నా ప్రధానమని అన్నారు. తనలాగే చాలా మంది ఇలా పొరపాటు చేసి ఉంటారని, తాను పెట్టిన ఆ ఫొటోను షేర్ చేసి ఉంటారని అన్నారు. తన కారణంగానైనా ఇది వెలుగులోకి వచ్చిందంటూ తన పొరపాటును సమర్థించుకున్నారు. మహవీర్‌కు బదులు బుద్ధుని ఫొటోను పెట్టిన క్లబ్‌లోకి వారందరికీ స్వాగతమని పేర్కొన్నారు. 

shashi
Congress
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News