Vijay Sai Reddy: విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేఈ కృష్ణమూర్తి

  • సీఎం తల్లిదండ్రుల గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారా?
  • విజయసాయిరెడ్డి ఎంపీనా లేక శునకమా?
  • మోదీ, పవన్, జగన్ కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసం చేశారు

సీఎం చంద్రబాబు తల్లిదండ్రుల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇంత ఘోరమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి ఎంపీనా లేక శునకమా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం తల్లిదండ్రుల గురించి ఇంత ఘోరంగా మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, పవన్, జగన్ కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసం చేశారని, చంద్రబాబును చూసి మోదీ భయపడుతున్నారని అన్నారు.

Vijay Sai Reddy
ke krishna murthy
  • Loading...

More Telugu News