lokesh: పెద్ద నగరాలతో పోటీ పడే సత్తా విశాఖకు ఉంది : మంత్రి నారా లోకేశ్

  • ఏపీకి పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి
  • విశాఖకు ‘కాన్డ్యూయెంట్’ రావడం గర్వకారణం
  • 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం

పెద్ద నగరాలతో పోటీ పడే సత్తా విశాఖపట్టణానికి ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీకి ఐటీ రంగంలో పెద్ద కంపెనీలు వస్తున్నాయని, కాన్డ్యూయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ వంటివి పెద్ద కంపెనీలని, కాన్డ్యూయెంట్ కంపెనీలో 92 వేల మంది పని చేస్తున్నట్లు చెప్పారు. కాన్డ్యూయెంట్ కంపెనీ విశాఖకు రావడం గర్వకారణంగా ఉందని, ఇటువంటి కంపెనీల రాకతో విశాఖ ప్రొఫైల్ మారనుందని, ఫిన్ టెక్ కు విశాఖ హెడ్ క్వార్టర్ గా ఉంటుందని అన్నారు. 2019 నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, 2,500 హై ఎండ్, డేటా సైంటిస్ట్ ఉద్యోగాలు రాబోతున్నాయని అన్నారు. విశాఖ గ్లోబల్ ఫింటెక్ హబ్ గా మారుతోందని, ఏపీలో పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఎంతో పాటుపడుతున్నారని లోకేశ్ అన్నారు.

  • Loading...

More Telugu News