Nayanatara: 'నయన' అందం నయనానందకరం... సోషల్ మీడియాలో ఫొటో వైరల్!

  • ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార నయనానందకర ఫొటో
  • తెగ లైక్‌లు కొడుతూ షేర్ చేస్తున్న నెటిజన్లు
  • ఆమె కర్తవ్యం సినిమాకు ప్రేక్షకాదరణ

దాదాపు పదేళ్లకు పైగా సౌతిండియాలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది మలయాళ ముద్దుగుమ్మ నయనతార. ఒక్క చిరుమందహాసంతో యువత హృదయాలని కొల్లగొట్టే అందం ఆమె సొంతం. సినిమాల పరంగా రోజురోజుకీ కాంపిటిషన్ పెరుగుతున్నా సరే వన్నె తరగని సొగసుతో ఆమె ఆఫర్లను అందిపుచ్చుకుంటూనే ఉంది.

ఈ మధ్య విడుదలయిన నయన్ ద్విభాషా చిత్రం 'కర్తవ్యం' ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా 'ది హిందూ' దినపత్రిక నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో 'ఎక్స్‌లెన్స్' అవార్డును కూడా దక్కించుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ మస్త్‌గా ఉన్న నయనతార సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ తన సినిమా వివరాలను, ఫొటోలను ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసిన ఫొటో అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్, నెటిజన్లు తెగ లైక్‌లు కొడుతూ షేర్ చేస్తున్నారు.

Nayanatara
Instagram
Photo
  • Loading...

More Telugu News