Australia: ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తీరుమార్చుకోండి: ఆసీస్ మాజీ కోచ్ సంచలన వ్యాఖ్యలు

  • ఆసీస్ ది అహంకారపూరిత ధోరణి
  • నియంతృత్వపోకడతో ఆసీస్ ఆటగాళ్లు తప్పుమీద తప్పులు చేస్తున్నారు
  • ప్రపంచ క్రికెట్ జట్లన్నింటిదీ ఒకదారైతే, ఆసీస్ ది మాత్రం మరొక దారి

బాల్ ట్యాంపరింగ్ వివాదంతో నిషేధానికి గురైన ఆసీస్ ఆటగాళ్లను తప్పు పడుతూనే ఆ దేశ క్రికెటర్లు వారికి ధైర్యం చెబుతుండగా, మాజీ క్రికెటర్, ఆసీస్ మాజీ కోచ్ మిక్కీ ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రతిష్ఠను మంటగలిపే పనులు చేస్తున్నారనేందుకు ఆసీస్ క్రికెటర్లు చేసిన పనే చక్కని ఉదాహరణ అని అన్నారు.

క్రికెట్ సంస్కృతి ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, ఆసీస్ అహంకారపూరిత ధోరణితో ఉందని ఆయన ఆరోపించారు. నియంతృత్వపోకడతో ఆసీస్ ఆటగాళ్లు తప్పుమీద తప్పులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రపంచ క్రికెట్ జట్లన్నింటిదీ ఒకదారైతే, ఆసీస్ మాత్రం మరొక దారిలో నడుస్తూ దోషిగా నిలబడిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆసీస్ బుద్ధి తెచ్చుకుని తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. 

Australia
ball tamparing
Cricket
  • Loading...

More Telugu News