Telangana: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన బలరాం రాథోడ్ ను అభినందించిన మంత్రి

- గిరిపుత్రులు తలచుకుంటే అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తారు
- అందుకు, బలరాం రాథోడే నిదర్శనం
- గిరిజనుల కోసం రెండు క్రీడా పాఠశాలలను ప్రారంభిస్తున్నాం
- తెలంగాణ గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి చందూలాల్
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లాకు చెందిన బలరాం రాథోడ్ ను తెలంగాణ గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అభినందించారు. హైదరాబాద్ లోని చందూలాల్ కార్యాలయంలో ఈరోజు ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం రాథోడ్ ను అభినందించారు. అనంతరం, చందూలాల్ మాట్లాడుతూ, గిరిపుత్రులు తలచుకుంటే అసాధ్యాన్ని, సుసాధ్యం చేస్తారని, వారికి సరైన ప్రోత్సాహం, తగిన శిక్షణ అందిస్తే ఎలాంటి కార్యాన్ని అయినా సాధిస్తారని, అందుకు, బలరాం రాథోడే నిదర్శనమని చెప్పారు.
