playboy: ఫేస్ బుక్ కు షాకిచ్చిన ప్లేబాయ్ మేగజీన్
- ఫేస్ బుక్ లో అకౌంట్ డిలీట్ చేసిన ప్లేబాయ్
- వినియోగదారుల సమాచారం లీకేజీ వ్యవహారమే కారణం
- మా వినియోగదారుల సమాచారాన్ని బయటపెట్టలేమన్న ప్లేబాయ్
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు ప్రముఖ మేగజీన్ ప్లేబాయ్ షాక్ ఇచ్చింది. ఫేస్ బుక్ లో తన అకౌంట్ ను డిలీట్ చేసింది. ఈ విషయాన్ని ప్లేబాయ్ వ్యవస్థాపకుడి కుమారుడు, సంస్థ చీఫ్ క్రియేటివ్ అధికారి కూపర్ హెఫ్నర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్లేబాయ్ విలువలకు విరుద్ధంగా ఫేస్ బుక్ సమాచార మార్గదర్శకాలు, కార్పొరేట్ పాలసీలు ఉన్నాయని ఆయన అన్నారు. లైంగిక సమాచార అణచివేతకు వేదికగా ఫేస్ బుక్ మారిందని మండిపడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో 5 కోట్ల మంది ఫేస్ బుక్ వినియోగదారుల సమాచారం లీక్ అయినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, తమ పేజీని తొలగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దాదాపు 25 లక్షల మంది ఫేస్ బుక్ ద్వారా ప్లేబాయ్ పేజీలను వీక్షిస్తారని... వీరి సమాచారాన్ని బయటపెట్టడం ఇష్టంలేకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.