homam: 'రంగస్థలం' సూపర్‌ హిట్‌ కావాలని అభిమానుల హోమం!

  • కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో హోమం
  • శ్రీకాళహస్తిలో కూడా హోమం చేసిన అఖిల భారత చిరంజీవి యువత
  • ఈ రోజు ఉదయం శ్రీవారి సన్నిధిలోనూ పూజ 

మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ తేజ్, సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న 'రంగస్థలం' సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయవంతం కావాలని చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో.. శ్రీ గణపతి ఉపనిషత్ పారాయణం, సహస్ర మోదక హోమం నిర్వహించారు.

అలాగే, అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం తిరుమలలోను, కానిపాకంలోను, శ్రీకాళహస్తిలోనూ ఆయన పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో శ్రీ నీలకంఠ పశుపత హోమం కూడా చేశారు.          

homam
Ramcharan
rangasthalam
  • Loading...

More Telugu News