charan: 'రంగస్థలం' మూవీకి హైలైట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్

  • కథాకథనాలే ప్రధానమైన బలం 
  • నాయకా నాయికల లుక్ ప్రత్యేక ఆకర్షణ
  • ఆకట్టుకోనున్న సంగీతం .. ఫోటోగ్రఫీ

చరణ్ కథానాయకుడిగా రూపొందిన 'రంగస్థలం' .. ప్రపంచవ్యాప్తంగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి కథా కథనాలు ప్రధానమైన బలమని దర్శకుడు సుకుమార్ చెబుతున్నాడు. చరణ్ లుక్ .. సమంత పాత్రను తీర్చిదిద్దిన తీరు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నాడు.

 ఇక ఈ సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ గా నిలుస్తుందనేది తాజా సమాచారం. కథ కీలకమైన మలుపు ఇక్కడే తిరుగుతుందట. అనూహ్యమైన ఈ మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుందనీ .. ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు. దేవిశ్రీ సంగీతం .. రత్నవేలు సినిమాటో గ్రఫీ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళుతుందని చెబుతున్నారు. అత్యధిక థియేటర్స్ లో భారీస్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనేది అభిమానుల మాట.    

  • Loading...

More Telugu News