Revanth Reddy: కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి

  • మెట్రో ప్రాజెక్టును అవినీతికి వనరుగా మార్చుకున్నారు
  • రూ. 1200 కోట్ల ఆస్తులను కాజేశారు
  • అవినీతిని ప్రశ్నించకుండా ఒవైసీతో రహస్య చర్చలు జరిపారు

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతికి వనరుగా మార్చుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టును చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థ అధికారులు రూ. 1200 కోట్ల విలువైన ఆస్తులను కేసీఆర్ బినామీ కంపెనీకి బదిలీ చేశారని తెలిపారు. కేవలం రూ. 250 కోట్లకే ఈ ఆస్తులను కేసీఆర్ కుటుంబ బినామీలు దక్కించుకున్నారని చెప్పారు. మెట్రోలో చోటు చేసుకున్న అవినీతిని ప్రశ్నించకుండా... ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో కేటీఆర్ రహస్యంగా చర్చలు జరిపారని తెలిపారు. తాను చేస్తున్న ఆరోపణలు నిజం కాకపోతే... దీనిపై విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.  

Revanth Reddy
KCR
KTR
Asaduddin Owaisi
metro project
curruption
  • Loading...

More Telugu News