paytm: కస్టమర్ల డేటాను చైనాకు పంపుతున్న పేటీఎం?

  • పేటీఎంకు వన్97 అనేది మాతృసంస్థ
  • ఈ కంపెనీకి విదేశీ సంస్థలతో సంబంధాలు
  • పేటీఎంలో అలీబాబాకు 40 శాతం వాటా

ఇప్పటికే ఆధార్ విశ్వసనీయతపై దేశ ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే ఆధార్ పేటీఎంకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆధార్ తో లింక్ చేసుకుంటే రూ. 200 క్యాష్ బ్యాక్ ఇస్తుండటం పేటీఎంపై అనుమానాలు తలెత్తేలా చేస్తోంది. పేటీఎం తన కస్టమర్ల వివరాలను చైనా సంస్థలతో పంచుకుంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పేటీఎంకు వన్97 అనేది మాతృసంస్థ. పేటీఎంకు సంబంధించిన వివరాలన్నీ ఈ సంస్థ సర్వర్లలోనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ సంస్థకు మరికొన్ని విదేశీ సంస్థలతో సంబంధం ఉందనే వాదన ఉంది. మరోవైపు చైనాకు చెందిన అతిపెద్ద సంస్థ అలీబాబాకు పేటీఎంలో 40 శాతం వాటాలు ఉన్నాయి. దీంతో, అలీబాబా సంస్థతో పేటీఎం తన కస్టమర్ల వివరాలను పంచుకుంటోందనే అనుమానాలు ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు తమ వినియోగదారుల వివరాలను దేశం దాటించకూడదు. అయితే, ఈ నిబంధన పేటీఎం బ్యాంకుకు వర్తిస్తుందో, లేదో తెలియాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News