balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ ను చేయగల దమ్ము ఒక్క బాలకృష్ణకి మాత్రమే వుంది: అల్లు అరవింద్

  • తెలుగువారికి గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే  
  • వాళ్లకు గౌరవాన్ని తెచ్చింది ఎన్టీఆర్ 
  • ఆయన బయోపిక్ చేయడం ఓ సాహసం

ఎన్టీఆర్ బయోపిక్ కి 'ఎన్టీఆర్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో కొంతసేపటి క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "నందమూరి అభిమానులందరికీ నా అభివందనాలు. తెలుగు వాళ్లకు గుర్తింపులేని రోజుల్లో మనమంతా మదరాసీలుగా పిలవబడేవాళ్లం. అలాంటి పరిస్థితుల్లో మేం మదరాసీలం కాదురా .. తెలుగు వాళ్లం అని మొదటిసారిగా చాటి చెప్పింది ఎన్టీ రామారావుగారు"

"అలా ఆయన తెలుగువారి ఖ్యాతిని పతాకస్థాయికి తీసుకెళ్లారు. అలాంటి మహత్తరమైన చరిత్ర కలిగిన ఎన్టీఆర్ బయోపిక్ ను తెరపైకి తీసుకురావాలనుకోవడం ఓ సాహసం .. అంతటి దమ్మున్న వ్యక్తి ఒక్క బాలకృష్ణ మాత్రమే. ఈ సినిమా చేయగల సమర్థత ఆయనకి మాత్రమే వుంది" అంటూ .. యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు.

balakrishna
allu aravind
  • Loading...

More Telugu News