Balakrishna: 'ఎన్టీఆర్' బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడే!

  • ఎన్టీఆర్ కి నేను వీరాభిమానిని 
  • ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను 
  • ఆయన సినిమా చేసే ఛాన్స్ రావడం అదృష్టం - తేజ  

అతిరథ మహారథుల సమక్షంలో 'ఎన్టీఆర్' సినిమాను కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. ఈ వేడుకకి బాలకృష్ణ సుయోధనుడి వేషధారణంలో హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకి తేజ దర్శకత్వం వహించనున్నారు.

ఈ సినిమా గురించి తేజ మాట్లాడుతూ .. "ఎన్టీఆర్ కి నేను వీరాభిమానిని .. ఎన్టీఆర్ సినిమాలు చూస్తూ పెరిగిన నేను .. ఆయన బయోపిక్ కి దర్శకత్వం వహించనుండటం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ జీవితచరిత్రకి సంబంధించిన కథ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ఆలోచనలో వున్నాం" అని అన్నారు. సాయి కొర్రపాటి .. విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చనున్నారు. సాయి మాధవ్ బుర్రా అందించే సంభాషణలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.  

  • Loading...

More Telugu News