China: మరో విశిష్ట నిర్మాణాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనున్న చైనా

  • గ్జాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో 55 కిలోమీటర్ల వంతెనను నిర్మించిన చైనా
  • ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన
  • సొరంగాలు, ద్వీపాల మీదుగా నిర్మించిన వంతెన

అనితర సాధ్యమైన నిర్మాణాలతో చైనా సత్తా చాటుతోంది. అతిపెద్ద టెలిస్కోప్, ఎత్తైన ప్రాంతాల్లో పటిష్ఠమైన గాజు వంతెనలు, సోలార్ రోడ్.. ఇలా ఎన్నో విశిష్టమైన నిర్మాణాలు చేపట్టిన చైనా...తాజాగా 55 కిలోమీటర్ల పొడవైన వంతెనను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.

 దక్షిణ చైనాలోని గ్జాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌ లోని సముద్రంపై ఈ వంతెన ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన కావడం విశేషం. దీని పొడవు 55 కిలోమీటర్లు కాగా, దీనిపై 23 కిలోమీటర్ల వంతెనలు, 6.7 కిలోమీటర్ల సొరంగాలు, రెండు కృత్రిమ ద్వీపాలు ఉండడం విశేషం. దీనిని జూలైలో ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

  • Loading...

More Telugu News