Rajasthan: ప్రకృతి విరుద్ధ చేష్టల ఆరోపణలతో రాజస్థాన్‌లో 'లిప్‌స్టిక్' బాబా అరెస్ట్

  • యువ శిష్యులతో మైథునం చేసేవారని బాబాపై ఆరోపణలు
  • వేధింపులు తట్టుకోలేక ఓ శిష్యుడి ఆత్మహత్య...!
  • బాధితులందరూ పురుషులే..వారికి వైద్య పరీక్షలు

రాజస్థాన్‌లో 'లిప్‌స్టిక్' బాబాగా సుపరిచితుడైన దైవాంస సంభూతుడు కుల్దీప్ సింగ్ ఝాని పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ప్రకృతి విరుద్థమైన రీతిలో తన పురుష అనుచరులను లోబర్చుకుని వారితో మైథునం చేస్తున్నాడని, ఆయన వల్ల ఝలవర్‌‌‌కి చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణలు బాబాపై వచ్చాయి.

మృతుడు యువరాజ్ సింగ్ తండ్రి సోహాన్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. బాబా ఆశ్రమంలో జరిగే అన్ని క్రతువులకు తమ కుటుంబం హాజరయ్యేదని ఆయన తెలిపాడు. కుల్దీప్ సింగ్ ఝా నవరాత్రుల సమయంలో మహిళ వేషధారణతో దర్శనమిచ్చేవాడు. ఆ సమయంలో లిప్ స్టిక్‌ను బాగా వేసుకునేవాడు.

ఇప్పటివరకు భక్తులు ప్రత్యక్షదైవంగా భావిస్తున్న బాబాపై మైథునం ఆరోపణలు రావడంతో ఆయన ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. యువరాజ్ సింగ్ ఓ యువతితో చనువుగా ఉంటున్నాడని తెలుసుకున్న బాబా అప్పటి నుంచి అతన్ని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో అతను ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకున్నాడు.

 కాగా, ఇప్పటివరకు చేపట్టిన విచారణ ప్రకారం, దాదాపు ఏడుగురు అనుచరులు ఆయన తమను ప్రకృతి విరుద్ధమైన రీతిలో మైథునం కోసం లైంగికంగా ఇబ్బందిపెట్టాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బాబా బాధితులందరూ పురుషులే కావడం గమనార్హం. దీంతో ఆయనపై వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చేందుకు బాధితులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News