Rakul: రకుల్ ప్రీత్ సింగ్ చెప్పేదంతా అబద్ధమే!: హీరోయిన్ మాధవీలత

  • టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదన్న రకుల్
  • అసత్యపు వ్యాఖ్యలేనన్న మాధవీలత
  • హీరోయిన్లకు వేధింపులు నిజమని వెల్లడి

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అన్న పదమే లేదని, అవకాశాల కోసం ఎవరూ ఏమీ త్యాగాలు చేయడం లేదని, హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురు అవుతున్నాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను హీరోయిన్ మాధవీలత తీవ్రంగా తప్పుబట్టింది.

రకుల్ పచ్చి అబద్ధాలు చెబుతోందని, టాలీవుడ్ లో హీరోయిన్లకు వేధింపులు నిజమని, అయితే, అవకాశాలు పోతాయన్న భయంతో ఎవరూ మాట్లాడరని వ్యాఖ్యానించింది. కాస్టింగ్ కౌచ్ ని ఎలా రూపుమాపాలో చర్చించి ఆలోచించాల్సిన సమయంలో, ఆ సంస్కృతి అసలే లేదని చెప్పడం తప్పని, సినీ అభిమానులను, ప్రజలను పిచ్చివాళ్లను చేయడానికే రకుల్ ఈ అబద్ధాలు చెప్పినట్టుందని అభిప్రాయపడింది. కాగా, మరో నటి శ్రీరెడ్డి కూడా రకుల్ వ్యాఖ్యలను తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

Rakul
Madhavi latha
Tollywood
  • Loading...

More Telugu News