prasanth: ప్రముఖ తమిళ హీరో మాజీ భార్య ఇంట్లో దొంగతనం!

  • హీరో ప్రశాంత్ మాజీ భార్య ఇంట్లో చోరీ
  • 170 తులాల బంగారం అపహరణ
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రముఖ తమిళ సినీ హీరో ప్రశాంత్ మాజీ భార్య గృహలక్ష్మి నివాసంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 170 తులాల బంగారాన్ని అపహరించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రశాంత్ మాజీ భార్య గృహలక్ష్మి అడయారులో ఓ అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. ఆమెకు టీనగర్ లో కూడా ఒక నివాసం ఉండటంతో... వారానికి ఒకసారి వచ్చి, వెళుతుంటారు.

ఈ నేపథ్యంలో, టీనగర్ లోని ఇంటి కిటికీని పగులగొట్టి ఉండటాన్ని ఇరుగుపొరుగు వారు బుధవారం ఉదయం గుర్తించారు. వెంటనే గృహలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో, వెంటనే తన సోదరిని అక్కడకు పంపించారామె. ఆమె లోపలకు వెళ్లి చూడగా... ఇంట్లో ఉంచిన 170 తులాల బంగారంతో పాటు, రూ. 10 వేలు చోరీకి గురైనట్టు గుర్తించారు. గృహలక్ష్మి ఫిర్యాదు మేరకు మాంబళం పోలీసులు కేసు నమోదు చేశారు. దొంగల వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. దర్యాప్తు ప్రారంభించారు.

prasanth
hero
wife
theft
kollywood
  • Loading...

More Telugu News