rajanikanth: రజనీకాంత్ సరసన మరోమారు నయనతార?

  • రజనీతో కార్తీక్ సుబ్బరాజ్ 
  • కథానాయికల పేర్లు పరిశీలన 
  • కొత్తగా తెరపైకి నయనతార పేరు

సన్ పిక్చర్స్ బ్యానర్ పై రజనీకాంత్ ఒక భారీ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా కోసం కథానాయికల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ జాబితాలో కథానాయికలుగా దీపికా పదుకొనే .. త్రిష .. అంజలి పేర్లు కనిపిస్తున్నాయి. దీపికా పదుకొనే డేట్స్ దొరికే అవకాశాలు చాలా తక్కువనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పుడు త్రిషకి గల క్రేజ్ అంతంత మాత్రమే.

రజనీ సరసన అంజలి సెట్ కాకపోవచ్చనే వారి సంఖ్యనే ఎక్కువగా వుంది. అందువలన ఈ సినిమా టీమ్ నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. అంతేకాకుండా సీనియర్ హీరోయిన్ గా రజనీ సరసన సెట్ అవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో వచ్చిన 'చంద్రముఖి' అందుకు ఒక ఉదాహరణ. అందువలన నయనతారను తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.  

rajanikanth
nayanatara
  • Loading...

More Telugu News