Renuka Choudhary: రేణుకా చౌదరి బరువు తగ్గించుకోవాలని వెంకయ్యనాయుడి సలహా!

  • ముగియనున్న రేణుకా చౌదరి రాజ్యసభ పదవీకాలం
  • వీడ్కోలు ప్రసంగం చేసిన రేణుక
  • నవ్వులు పూయించిన రేణుక, వెంకయ్యల కౌంటర్లు  

మరికొద్ది రోజుల్లో తన రాజ్యసభ పదవీకాలాన్ని ముగించుకోనున్న కాంగ్రెస్ మహిళా నేత రేణుకా చౌదరి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడి మధ్య ఆసక్తికర సంవాదం జరిగింది. పదవీ విరమణ చేస్తున్న ఎంపీలకు వీడ్కోలు పలుకుతున్న వేళ, ప్రసంగించిన రేణుక "ఆయన (వెంకయ్య) నన్ను ఎన్నో కిలోలుగా (సంవత్సరాలుగా అన్న మాటకు బదులు రేణుక 'కిలో' పదాన్ని వాడారు) ఎరుగుదురు. సార్, నా బరువు గురించి చాలా మంది బాధపడుతున్నారు. కానీ మీరు చేస్తున్న ఈ ఉద్యోగంలో బరువు బాధ్యతలను సక్రమంగా నెరవేర్చండి" అన్నారు.

వెంటనే రేణుకా చౌదరి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన వెంకయ్య, "నేనిచ్చే సింపుల్ సలహా ఏంటంటే, మీ బరువును తగ్గించుకోండి. పార్టీ బరువును (ప్రతిష్ఠను) పెంచే ప్రయత్నాలు చేయండి" అన్నారు. ఆయన మాటలకు ఏ మాత్రం తగ్గని రేణుక "సార్... కాంగ్రెస్ చాలా బాగుంది. ఎవరూ ఏమీ చేయలేరు" అన్నారు. దీంతో సభలోని మిగతావారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఇక సభ్యుల వీడ్కోలు ప్రసంగాల్లో పలుమార్లు నవ్వులు విరబూశాయి.

Renuka Choudhary
Venkaiah Naidu
Rajya Sabha
  • Loading...

More Telugu News