Canada: అదృష్టం ఇలా కూడా వరిస్తుంది.. షాపింగ్‌కు వెళ్తే రూ.5.50 కోట్ల లాటరీ తగిలింది!

  • కోట్లకు అధిపతిని చేసిన పుట్టిన రోజు
  • ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న కెనడా యువతి
  • వారానికి వెయ్యి డాలర్ల చొప్పున జీవితాంతం తీసుకునేందుకు అంగీకారం

అదృష్టం ఏవైపు నుంచి వచ్చి కౌగిలించుకుంటుందో చెప్పడం కష్టం. కెనడాకు చెందిన చార్లీ లగార్డె అనే యువతికి ఇటువంటి అనుభవమే ఎదురైంది. ఒక్కసారిగా వచ్చిన అదృష్టం 18 ఏళ్లకే ఆమెను కోటీశ్వరురాలిని చేసింది. ఈనెల 14న ఆమె పుట్టిన రోజు కావడంతో కొత్త దుస్తులు కొనుక్కునేందుకు షాపింగ్‌కు వెళ్లింది. అక్కడే ఆమె ఓ లాటరీ టికెట్‌ను కూడా కొనుగోలు చేసింది. ఆ తర్వాత తాను లాటరీ టికెట్ కొన్న విషయాన్ని మర్చిపోయిన ఆమె తన పుట్టిన రోజును ఆనందంగా జరుపుకుంది.

షాపింగ్ సందర్భంగా కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు భారీ బహుమతి వచ్చినట్టు నిర్వాహకుల నుంచి ఈనెల 26 న ఫోన్ రావడంతో ఆమె ఉబ్బితబ్బిబ్బయింది. ఏకంగా రూ. 5.50 కోట్లు తగిలిన విషయం తెలియడంతో  ఆమె ఆనందానికి హద్దే లేకుండా పోయింది. లాటరీలో విజేతగా నిలిచిన ఆమెకు నిర్వాహకులు రెండు అవకాశాలు ఇచ్చారు. అందులో మొదటిది మొత్తం డబ్బును ఇచ్చేయడం కాగా, రెండోది ప్రతి వారం వెయ్యి డాలర్ల చొప్పున జీవితాంతం అందించడం. తల్లిదండ్రులతో చర్చించిన అనంతరం వారి సలహా మేరకు రెండో ఆప్షన్‌నే ఆమె ఎంచుకుంది. ఫలితంగా ఇప్పుడు వారానికి వెయ్యి డాలర్లు అందుకుంటోంది.  

లాటరీ తగిలిన ఆనందాన్ని చార్లీ పంచుకుంటూ.. ఇంత పెద్ద మొత్తం వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ఫొటోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కోర్సులో భాగంగా ఈ సొమ్ముతో నచ్చిన ప్రాంతానికి వెళ్లే అవకాశం చిక్కిందన్నారు.  

  • Loading...

More Telugu News