NTR: మరో రెండు గంటల్లో ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రారంభోత్సవం.. తరలిరానున్న నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు

  • ఉదయం 9:30 గంటలకు ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభం
  • తరలిరానున్న నందమూరి కుటుంబ సభ్యులు
  • భద్రతా వలయంలో రామకృష్ణ స్టూడియో

దేశ రాజకీయాలను మలుపుతిప్పిన దివంగత నందమూరి తారకరామారావు జీవిత విశేషాలతో రూపొందిస్తున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ సినిమా ప్రారంభోత్సవానికి నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియో సిద్ధమైంది. నేటి ఉదయం 9:30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు, సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానుండడంతో రామకృష్ణ స్టూడియోస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

స్టూడియో ప్రధాన ద్వారం వద్ద శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ నిలువెత్తు కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు తేజ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టూడియోకు చేరుకుంటున్నారు.

NTR
Movie
Balakrishna
Teja
Tollywood
  • Loading...

More Telugu News