Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సాయి పల్లవికి మరో భారీ ఆఫర్ 
  • మరో దర్శకుడికి ఓకే చెప్పిన నితిన్ 
  • చరణ్ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్

*  తెలుగు, తమిళ భాషల్లో బిజీ నాయికగా రాణిస్తున్న సాయిపల్లవికి తాజాగా తమిళం నుంచి మరో భారీ ఆఫర్ వచ్చింది. శివకార్తికేయన్ సరసన నటించే ఛాన్స్ ఆమెకు తాజాగా వచ్చింది. జ్ఞానవేల్ రాజా నిర్మించే ఈ చిత్రానికి రాజేష్ దర్శకత్వం వహిస్తాడు. కాగా, సాయిపల్లవి ఇప్పటికే తమిళంలో ధనుష్, సూర్య సరసన చెరో చిత్రంలోనూ నటిస్తోంది.
*  ఇటీవల 'చలో' చిత్రంతో హిట్ కొట్టిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించనున్నాడు. ఈ విషయం గురించి నితిన్ చెబుతూ ఇది పూర్తి ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని చెప్పాడు. కాగా, నితిన్ ప్రస్తుతం 'శ్రీనివాస కల్యాణం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
*  రామ్ చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఒక ఐటెం సాంగును ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటలో తమన్నా నటిస్తుందని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం తొలి షెడ్యూలు ఇప్పటికే పూర్తయింది.    

  • Loading...

More Telugu News