Roja: వేంకటేశ్వరస్వామి దయ వల్లే బయటపడ్డా: రోజా

  • విమానం ల్యాండ్ కాగానే పెద్ద శబ్దం వచ్చింది
  • మంటలు చుట్టుముట్టడంతో వణికిపోయాం
  • విమానం పేలిపోతుందని అనుకున్నా

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే పెను ప్రమాదం తృటిలో తప్పిందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రమాద ఘటనపై ఆమె మాట్లాడుతూ.. శంషాబాద్‌లో విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని తెలిపారు. తొలుత మంటలు కనిపించాయని, ఆ తర్వాత కాసేపటికే విమానం రన్‌వేపై ఆగిపోయిందన్నారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరిగిందో అర్థం కాక అందరం భయపడ్డామని, తానైతే విమానం పేలిపోతుందేమోనని అనుకున్నానని పేర్కొన్నారు. మంటలు అదుపు చేశాక అరగంట వరకు విమానం డోర్లు తెరవకపోవడంతో వణికిపోయినట్టు చెప్పారు. ల్యాండయ్యే సమయంలో విమానం టైరు పేలిపోయిందని తెలిసిందని, మంటలు చూసి భయపడిన ప్రయాణికులు విమానం నుంచి దిగాలని ప్రయత్నించినా ఎయిర్ హోస్టెస్ వద్దని చెప్పడంతో ఆగిపోయినట్టు రోజా వివరించారు.

Roja
YSRCP
Indigo
Tirumala
  • Loading...

More Telugu News