పవన్ చెప్పే ప్రతి దానికి ‘జీ హుజూరు’ అనేందుకు మేమేమైనా పిచ్చోళ్లమా? : నటుడు శివాజీ
- ప్రశ్నించమని పవన్ అంటారుగా, అందుకే ఆయన్ని ప్రశ్నిస్తున్నా
- పాచిపోయిన లడ్డూలిచ్చారన్న పవన్ లో ఎంతమార్పు?
- లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేయడం తగదు
ప్రధాన మంత్రి మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేరని చెప్పిన పవన్ కల్యాణ్.. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని తనతో బాగానే ఉంటారని చెప్పారు. మూడు సంవత్సరాల్లో పవన్ చక్కగా మూడు సినిమాలు చేసుకున్నారు... చక్కగా సంపాదించేసుకున్నారు. మొన్న బహిరంగసభలో లోకేశ్ పై అవినీతి ఆరోపణలు చేశారు. ఆధారాలేవని అడిగితే.. ‘బయట అనుకుంటున్నారు’ అని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. మీరు ఎంత గొప్ప హీరో అయినప్పటికీ, మీరు చెప్పే ప్రతిదానికీ ‘జీ హుజూరు’ అనడానికి మేము ఏమైనా పిచ్చోళ్లమా? ప్రశ్నించమని మీరే అన్నారు, అందుకే, ప్రశ్నిస్తున్నాను’ అని అన్నారు శివాజీ.