Chandrababu: ఆ పదవి కావాలని నేను అడిగానా, చంద్రబాబుని అడగండి?: నటుడు శివాజీ

  • కనీసం దర్శనానికి టికెట్టు ఇప్పించమని కూడా నేను అడగలేదు
  • నేను అడిగానని చెబితే నన్ను ఉరేయండి
  • ఆ పదవి కావాలనే కోరికే ఉంటే చంద్రబాబు, బీజేపీతోనే కలిసి ఉండేవాడినిగా! 

టీటీడీ చైర్మన్ పదవి కావాలని తానెన్నడూ అడగలేదని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. ‘ఎన్టీవీ’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనందుకే మీకు బీజేపీ, టీడీపీపై ఒకేసారి కోపం వచ్చినట్టుంది’ అనే ప్రశ్నకు శివాజీ స్పందిస్తూ, ‘టీటీడీ చైర్మన్ పదవి లేదా టీటీడీ సభ్యుడి పదవి..కనీసం దర్శనానికి ఓ టికెట్టు ఇవ్వమని కూడా నేను ఎవర్నీ అడగలేదు. ఈ విషయాన్ని చంద్రబాబునాయుడిని అడగండి. నేను అడిగానని చెబితే నన్ను ఉరేయండి. నాకు ఆ పదవి కావాలనే కోరికే ఉంటే, చంద్రబాబునాయుడు గారితో, బీజేపీతోనే నేను కలిసి ఉండాలిగా?’ అని ప్రశ్నించారు.

Chandrababu
artist shivaji
  • Loading...

More Telugu News