madame tussauds: అరుదైన ఘనత సాధించిన క్రికెటర్ విరాట్ కోహ్లీ

  • డిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లీ
  • ఇప్పటికే సచిన్, కపిల్ దేవ్‌ల మైనపు బొమ్మలు
  • బాలీవుడ్ స్టార్లు అమితాబ్, ఐశ్వర్య, హృతిక్ కూడా

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. డిల్లీలోని ప్రఖ్యాత 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియంలో అతని మైనపు బొమ్మను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో బాలీవుడ్, హాలీవుడ్, క్రీడా ప్రముఖుల మైనపు బొమ్మలు ఉన్నాయి. కోహ్లీ తాజాగా వారి సరసన చేరిపోయాడు. ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్‌లు ఇప్పటికే ఈ అరుదైన గుర్తింపును పొందారు. మరోవైపు బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, హృతిక్ రోషన్‌లు కూడా ఈ ఘనతను సాధించారు. ప్రధాని మోదీ మైనపు బొమ్మను కూడా ఈ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

  • Error fetching data: Network response was not ok

More Telugu News