sukumar: సుకుమార్ నెక్స్ట్ మూవీ కుర్ర హీరోతో .. చిన్న బడ్జెట్లో!

  • సుకుమార్ సినిమాల్లో భారీతనం
  • స్టార్ హీరోలు .. హీరోయిన్లు 
  • తదుపరి సినిమా విషయంలో మార్పు

తెలుగులోని అగ్రదర్శకులలో సుకుమార్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ఎన్టీఆర్ తో సుకుమార్ చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమా షూటింగ్ దాదాపు విదేశాల్లోనే జరిగింది. దాంతో ఈ సినిమాకి భారీస్థాయిలో ఖర్చు అయింది. ఇక తాజాగా ఆయన చేసిన 'రంగస్థలం' కోసం ఏకంగా విలేజ్ సెట్ వేశారు. ఈ కారణంగా ఈ సినిమాకి కూడా భారీగా ఖర్చు అయింది.

వరుసగా స్టార్ హీరోలతో .. భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ వస్తోన్న సుకుమార్, నెక్స్ట్ ఏ స్టార్ హీరోతో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సారి ఆయన ఓ మాదిరి బడ్జెట్ తో ఓ కుర్రహీరోతో సినిమా చేయాలనుకుంటున్నాడట. అందుకు తగిన కథను సిద్ధం చేసుకుని రంగంలోకి దిగే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి మరి.    

  • Loading...

More Telugu News