జిమ్‌లో తనయ అక్షరతో కమల్ కసరత్తులు...!
- వెబ్‌సిరీస్‌లో నటించనున్న అక్షర
- ట్రైనర్ సూరి పర్యవేక్షణలో జిమ్
- సరదాగా వెళ్లిన కమల్...కూతురితో దిగిన ఫొటో ట్విట్టర్‌లో అప్ లోడ్
న్యాయం కోసం పోరాడే 18 ఏళ్ల బాలిక జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ వెబ్‌సిరీస్‌కు ఆదిత్య దత్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సిరీస్ కోసం ఆమె కాస్త ఒళ్లు పెంచాల్సి ఉంది. అందుకే ఫిట్‌నెస్ ట్రైనర్ సూరి పర్యవేక్షణలో ఆమె జిమ్ చేస్తున్నారు. అక్షరతో పాటు జిమ్‌కు సరదాగా వెళ్లిన కమల్..ఓ ఫొటో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.