teja: శ్రీరెడ్డితో మాట్లాడిన తేజ .. రెండు సినిమాల్లో ఆమెకి అవకాశం

  • శ్రీరెడ్డి చేసిన ఆరోపణలు విన్నాను 
  • ఆమెని పిలిపించి మాట్లాడాను 
  • ఆమెకి అన్యాయం జరిగింది

తెలుగు చిత్రపరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు దక్కడం లేదనీ, అవకాశాల కోసం ప్రయత్నించిన అమ్మాయిలకు దారుణమైన పరిస్థితులు ఎదురవుతున్నాయంటూ కొన్ని రోజులుగా శ్రీరెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆమె ఈ రకమైన ఆరోపణలతో మీడియాకెక్కితే అవకాశాలు రావడం మరింత కష్టమైపోతుందని అంతా అనుకున్నారు.

కానీ తాను చేస్తోన్న రెండు సినిమాల్లో ఆమెకి అవకాశం ఇస్తున్నట్టుగా చెప్పి దర్శకుడు తేజ అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీరెడ్డి ఆరోపణలను గురించి విని ఆమెను పిలిపించి మాట్లాడాననీ, ఆమెకి అన్యాయం జరిగిందనే తనకి అనిపించిందని అన్నారు. రెండు సినిమాల్లో ఆమెకి అవకాశాలు ఇస్తున్నట్టుగా చెప్పారు. ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు వెంకటేశ్ తోను తేజ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏదేవైనా రెండు పెద్ద ప్రాజెక్టులలో శ్రీరెడ్డికి అవకాశాలు దక్కడం విశేషమే.   

teja
sri reddy
  • Loading...

More Telugu News