bjp: బీజేపీ నుంచి పోటీ చేయనున్న గాలి జనార్దన్ రెడ్డి?

  • మే 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు
  • బీజేపీ టికెట్ పై మా అన్నయ్య పోటీ చేస్తారన్న ‘గాలి’ సోదరుడు?
  • ఇంతవరకూ ఎటువంటి ప్రకటనా చేయని బీజేపీ

కర్ణాటకలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  మైనింగ్ కేసులో నిందితుడు,  ప్రముఖ వ్యాపార వేత్త గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తరపున ఆయన బరిలోకి దిగుతారని సమాచారం. బీజేపీ టికెట్ పై అన్నయ్య జనార్దన్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన తమ్ముడు సోమశేఖర్ రెడ్డి చెప్పినట్టు మీడియా కథనాలు.

ఇదిలా ఉండగా, గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తారనే విషయమై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు తాము ఇంకా బీజేపీలోనే ఉన్నామని చెబుతున్న విషయమై కూడా పార్టీ నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో జనార్దన్ రెడ్డి సోదరుడు చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, మే 12న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ కు, బీజేపీకి ఇవి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.

bjp
gali janardhan reddy
  • Loading...

More Telugu News