shilpa shetty: వేదికపై యోగాసనాలు వేసిన శిల్పా శెట్టి

  • 'ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా'ను విడుదల చేసిన శిల్పా శెట్టి
  • వేదికపై యోగాసనాలు వేసిన నటి
  • పలు వ్యాపకాలతో బిజీగా ఉన్న శిల్పా

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి యోగాలో మంచి ఎక్స్ పర్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆమె యోగా వీడియోలు కూడా బాగా పాప్యులర్ అయ్యాయి. తాజాగా తన రెండవ పుస్తకం 'ది డైరీ ఆఫ్ ఏ డొమెస్టిక్ దివా'ను విడుదల చేసింది. ఈ సందర్భంగా వదులుగా ఉన్న దుస్తులను ధరించిన ఆమె వేదికపై యోగాసనాలను ప్రదర్శించింది.

 అనంతరం ఆమె మాట్లాడుతూ, దుస్తులు లేకపోతే తాను మరింత మెరుగ్గా యోగా చేయగలనని సరదాగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పలు బ్రాండ్లకు శిల్పా శెట్టి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాజస్థాన్ రాయల్స్ కు సహ యజమానిగా ఉంది. దీనికి తోడు ఓ టీవీ రియాల్టీ షోకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది.

shilpa shetty
yoga
The Diary of a Domestic Diva
  • Error fetching data: Network response was not ok

More Telugu News