YSRCP: రాజీనామా లేఖలపై సంతకాలు చేసిన వైసీపీ ఎంపీలు

  • స్పీకర్ ఫార్మాట్ లో ఉన్న రాజీనామా లేఖలపై సంతకాలు
  • రాజీనామా లేఖలతో పార్లమెంటుకు వచ్చిన ఎంపీలు
  • సభ నిరవధిక వాయిదా పడితే.. రాజీనామాల సమర్పణ

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైసీపీ లోక్ సభ ఎంపీలు మరో ముందడుగు వేశారు. పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేసిన మరుక్షణమే రాజీనామాలు చేస్తామని ఇదివరకే ప్రకటించిన ఎంపీలు... తమ కార్యాచరణను మొదలు పెట్టారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు.

ఈ లేఖలతోనే ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్ రెడ్డి, మిథున్ రెడ్డిలు లోక్ సభకు వచ్చారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒకవేళ లోక్ సభను నిరవధికంగా వాయిదా వేస్తే, వెంటనే తమ రాజీనామాలను సమర్పించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే, సభను నిరవధికంగా కాకుండా... సోమవారానికి ఆమె వాయిదా వేశారు. దీంతో, సోమవారం వరకు వేచి చూసి, తమ కార్యాచరణను అమలు చేయాలని వైసీపీ ఎంపీలు నిర్ణయించారు. 

YSRCP
mps
Lok Sabha
resignations
  • Error fetching data: Network response was not ok

More Telugu News