journalists: ఇండియాలో జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందన

  • జర్నలిస్టుల హత్యలను ఖండించిన ఐరాస అధ్యక్షుడు
  • భారత్ లో జరుగుతున్న హత్యలు బాధాకరం
  • నీతిగా పనిచేస్తున్న జర్నలిస్టులను చంపడం దారుణం

మన దేశంలో చోటు చేసుకుంటున్న జర్నలిస్టుల హత్యలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. జర్నలిస్టులపై హింసకు పాల్పడటం, హత్యలు చేయడం లాంటి ఘటనలు భారత్ లో చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గట్టర్స్ అన్నారు. మెరుగైన సమాజం కోసం పని చేస్తున్న జర్నలిస్టులను అంతమొందించడం దారుణమని అన్నారు.

మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలో ఇసుక మాఫియాపై వరుసగా స్టింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ... ఇసుక మాఫియాతో పోలీసులు లాలూచీ పడిన వ్యవహారాన్ని టీవీ జర్నలిస్టు సందీప్ శర్మ బయటపెట్టారు. ఈ నేపథ్యంలో, సోమవారంనాడు ఆయనను లారీతో ఢీకొట్టించి చంపేశారు.

మరోవైపు, బీహార్ భోజ్ పూర్ జిల్లాలో ఓ దినపత్రికలో పనిచేస్తున్న జర్నలిస్ట్ నవీన్ నిశ్చల్ ఆదివారం రాత్రి బైక్ పై వెళుతుండగా, వెనుక నుంచి మరో వాహనంతో ఢీకొట్టించి చంపేశారు. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆయన స్నేహితుడు కూడా మరణించారు. ఈ హత్యలను ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఖండించారు. 

  • Loading...

More Telugu News