sai dharam tej: నానికి చెప్పిన కథతోనే మెగాహీరో మూవీ!

  • ప్రస్తుతం కరుణాకరన్ తో తేజు 
  • ఆ తరువాత గోపీచంద్ మలినేనితో 
  • అదే సమయంలో కిషోర్ తిరుమలతో సెట్స్ పైకి  

ప్రస్తుతం సాయిధరం తేజ్ .. కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. కె.ఎస్. రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని సినిమాతో పాటు .. కిషోర్ తిరుమల సినిమాను సాయిధరమ్ తేజ్ చేయనున్నాడు.

ముందుగా నానితో చేయాలనే ఉద్దేశంతో కిషోర్ తిరుమల ఒక కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే నాని ఫుల్ బిజీగా ఉండటం వలన .. ఇప్పట్లో ఈ సినిమా చేయలేని పరిస్థితి నెలకొంది. దాంతో ఆయన సాయిధరమ్ తేజ్ ను సెట్ చేసుకుని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇది నానికి వినిపించిన కథనా? వేరే కథేనా? అనే సందేహం అభిమానుల్లో ఉండేది. ఇది నానికి వినిపించిన కథేననీ .. సాయిధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్పులు చేయడం జరిగిందని తాజాగా దర్శకుడు స్పష్టం చేశాడు. కిషోర్ తిరుమల యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఈ కథను రూపొందించాడని సమాచారం.      

sai dharam tej
kishor thirumala
  • Loading...

More Telugu News