budda venkanna: వీళ్లను చూసుకునే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి దారుణ వ్యాఖ్యలు చేశారు: బుద్దా వెంకన్న

  • బుద్ధి ఉన్నవారు ఎవరూ తల్లిదండ్రులను విమర్శించరు
  • విజయసాయి నీచ రాజకీయ నాయకుడు
  • ఆయన వ్యాఖ్యల వెనుక బీజేపీ ఉంది

ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్థిక నేరస్తుడైన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించడం సిగ్గుచేటని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా విజయసాయి వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. బుద్ధి ఉన్నవారెవరైనా... తల్లిదండ్రులను నిందిస్తారా? అని ప్రశ్నించారు. విజయసాయి విమర్శల వెనుక బీజీపీ ఉందని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు ప్రజానేత అని... విజయసాయి ధనబలం ఉన్న నీచ రాజకీయ నాయకుడని అన్నారు. ఆయన చేసిన నీచమైన వ్యాఖ్యలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రధాని కాళ్లపై పడ్డ విజయసాయికి చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని... మరోసారి ఇలాంటి విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి కొన్ని పార్టీలు రాకపోవడం దారుణమైన చర్య అని అన్నారు.

budda venkanna
Vijay Sai Reddy
Chandrababu
BJP
YSRCP
Telugudesam
comments
  • Loading...

More Telugu News