charan: చరణ్ మాములుగా కష్టపడలేదు: సమంత

  • 'చిట్టిబాబు'గా చరణ్ అదరగొట్టేశాడు 
  • ఆయన అంకితభావం ఆశ్చర్యాన్ని కలిగించింది
  • మా కెరియర్లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుంది  

చరణ్ .. సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన 'రంగస్థలం' సినిమా ఎల్లుండి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చరణ్ సరసన కథానాయికగా సమంత చేసింది. తాజాగా ఈ సినిమాను గురించి సమంత మాట్లాడుతూ .. "ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం కలిగిన 'చిట్టిబాబు' పాత్రలో కనిపిస్తాడు. ఇప్పటికే ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ కి .. సాంగ్స్ కి మంచి క్రేజ్ రావడానికి కారణం చరణ్ కి గల అంకితభావమే.

 ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రతి సీన్ .. ప్రతి సాంగ్ బాగా రావడం కోసం ఆయన పడే తపన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమా చూసిన తరువాత 'రంగస్థలం' ముందు చరణ్ .. 'రంగస్థలం' తరువాత చరణ్ అని మాట్లాడుకోవడం ఖాయం. అంతగా ఈ సినిమా ద్వారా ఆయన ప్రేక్షకులను ప్రభావితం చేయనున్నాడు. మా ఇద్దరి కెరియర్లో ఇది బెస్ట్ సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.   

  • Loading...

More Telugu News