Australia: స్మిత్ కి నిజంగానే బుర్రలేదని నాకు అర్థమైంది: సౌరవ్ గంగూలీ
- బాల్ ట్యాంపరింగ్ తెలివితక్కువ పని
- ఎలాగైనా గెలవాలన్న పంతంలో అర్థం లేదు
- 1981 నుంచి ఆసీస్ ఇలాగే వ్యవహరిస్తోంది
బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంతో ఆస్ట్రేలియా క్రికెట్ పరువును బజారుకీడ్చిన స్మిత్ తీరుపై టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అసహనం వ్యక్తం చేశాడు. బాల్ ట్యాంపరింగ్ అనేది తెలివితక్కువ పని అని గంగూలీ పేర్కొన్నాడు. ఎలాగైనా గెలవాలన్న ఆసీస్ పంతంలో అర్థం లేదని అభిప్రాయపడ్డాడు.
గతంలో భారత్ తో రివ్యూ వివాదం సమయంలో తన బుర్ర పని చేయలేదని స్మిత్ అంటే ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు అలా అని ఉంటాడని భావించానని గంగూలీ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు నిజంగా స్మిత్ కు బుర్ర లేదని తనకు అర్థమైందని గంగూలీ చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టు 1981 నుంచి ఇదే తరహా వ్యవహార శైలితో క్రికెట్ ఆడుతోందని మండిపడ్డాడు. స్మిత్, వార్నర్, బాన్ క్రాఫ్ట్ లు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడకుండా ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.