Uttar Pradesh: భార్య సహా ఇద్దరు కొడుకులను జూదమాడిన భర్త!

  • భార్య, బిడ్డలను జూదమాడిన మోహిసీన్
  • మోహిసీన్ భార్యను తనతో రావాలని ఒత్తిడి చేసిన ఇమ్రాన్
  • భర్తకు విడాకులిచ్చి, కొడుకుని తీసుకెళ్లిన ఇమ్రాన్ పై కేసు పెట్టిన మోహిసీన్ భార్య

వ్యసనం అన్నది ఎంతకైనా తెగించేలా చేస్తుంది. యూపీలోని బులాంద్‌ షహర్‌ కు చెందిన మోహిసీన్ కూడా అలాగే వ్యసనానికి బానిసై, మిత్రుడు ఇమ్రాన్ తో జూదమాడి, తన భార్య, ఇద్దరు పిల్లల్ని ఓడిపోయాడు. దీంతో జూదంలో గెలిచిన ఇమ్రాన్‌, నేరుగా మోహిసీన్‌ ఇంటికి వెళ్ళి అతని భార్యను తనతో రమ్మని బలవంతం చేశాడు. దీంతో అతనికి స్థానికులు అడ్డుతగలగా, బాధితురాలు ఆందోళనకు దిగింది. దీంతో ఇమ్రాన్ పంచాయతీ నిర్వహించాడు.

పంచాయతీ పెద్దలు జూదంలో మోహిసీన్ ఓటమిపాలయ్యాడు కనుక, అతని భార్య ఇమ్రాన్ తో వెళ్లేందుకు నిరాకరించడంతో అతని పిల్లల్లో ఒకరిని అతని వెంట పంపాలని తీర్పునిచ్చింది. దీంతో ఆమె పిల్లల్లో ఒకరిని ఇమ్రాన్ తన వెంట తీసుకెళ్లిపోయాడు. దీంతో మోహిసీన్ కు అతని భార్య విడాకులిచ్చేసింది. అనంతరం తన భర్త, బలవంతంగా తనను తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఇమ్రాన్, మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించి, తన కుమారుడ్ని ఇమ్రాన్ చెర నుంచి విడిపించాలని కోరింది. పిటిషన్ చూసిన చీఫ్‌ జ్యూడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Uttar Pradesh
bulandshahar
man gambled wife
  • Loading...

More Telugu News