Chandrababu: చంద్రబాబుపై అలా మాట్లాడడమంటే ఏపీ ప్రజలను అవమానించినట్టే!: అవంతి శ్రీనివాస్

  • హుందాతనం కోల్పోయేలా విజయసాయిరెడ్డి మాట్లాడారు
  • ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లను సహించం
  • ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం  

తమ అధినేత చంద్రబాబునాయుడుపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని, ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన హుందాతనం కోల్పోయేలా విజయసాయిరెడ్డి మాట్లాడారని, చంద్రబాబును ఆ విధంగా మాట్లాడడమంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్టేనని మండిపడ్డారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లను సహించమని హెచ్చరించారు. కేంద్రంపై వైసీపీ అవిశ్వాసం పెడితే మద్దతు ఇస్తామని అసెంబ్లీలోనే సీఎం చంద్రబాబునాయుడు చెప్పారని, రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో, రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని అన్నారు. అసలు, వైసీపీ  అజెండా ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని అన్నారు.

Chandrababu
avanthi srinivas
  • Loading...

More Telugu News