Amitabh Bachchan: 'సైరా'లో అమితాబ్ గెటప్ ఇలా ఉంటుందట..!

  • సైరా సినిమాలో తన గెటప్ గురించి సోషల్ మీడియాలో ఓ ఫొటో విడుదల చేసిన అమితాబ్
  • ఇది ఫైనల్ కాదని, దాదాపుగా ఇలాగే ఉంటుందని సూచన
  • షూటింగ్ కోసం హైదరాబాద్ వెళుతున్నానని వెల్లడి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తన గెటప్‌కు సంబంధించిన ఫొటోని బిగ్ బి తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ లుక్ ఇంకా ఫైనల్ కాలేదని, దాదాపుగా ఇలాగే ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

"నా ప్రియమైన మిత్రుడు చిరంజీవి సైరా చిత్రంలో అత్యంత సాహసోపేతమైన పాత్రలో నటిస్తున్నారు. ఇంత గొప్ప చిత్రంలో నటించమని ఆయన నన్ను కోరారు. అందుకే నేను ఒప్పుకున్నా. షూటింగ్‌లో పాల్గొనడం కోసం మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు బయలుదేరుతున్నాను" అని అమితాబ్ ట్వీట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Amitabh Bachchan
Chiranjeevi
Saira
Nayanatara
Twitter
  • Loading...

More Telugu News