kiara adwani: మహేశ్ బాబు చాలా హెల్ప్ చేశారు: కైరా అద్వాని

  • 'భరత్ అనే నేను'లో ఛాన్స్ రావడం నా అదృష్టం
  •  డైలాగ్స్ ముందుగానే ప్రాక్టీస్ చేశాను
  • భాష సమస్యతో బాధపడలేదు  

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరత్ అనే నేను'లో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పరంగా ముగింపుదశకి చేరుకోవడం .. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. తెలుగులో తొలి సినిమానే స్టార్ డైరెక్టర్ తోను .. సూపర్ స్టార్ మహేశ్ బాబుతోను చేయడం తన అదృష్టమని అంది.

ఈ ఇద్దరూ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తనవంతు కృషి చేస్తున్నానని చెప్పింది. డైలాగ్ వెర్షన్ ను ముందుగానే తనకు ఇవ్వడం వలన బాగా ప్రాక్టీస్ చేసేదానిననీ, అందువలన తెలుగు భాష రాకపోవడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదని అంది. డైలాగ్స్ విషయంలో మహేశ్ బాబు తనకి ఎంతో హెల్ప్ చేశారని చెప్పింది. ఈ సినిమాలో తన పాత్ర ఎంతో సంతృప్తిని ఇచ్చిందనీ, ఈ పాత్ర అమ్మాయిలందరికి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చింది.   

kiara adwani
Mahesh Babu
  • Loading...

More Telugu News