Chandrababu: ఏ2 నిందితుడే సీఎంను దొంగ అనడం విడ్డూరం: చినరాజప్ప

  • బాబుపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన చినరాజప్ప
  • పీఎంఓలో జగన్ లాబీయింగ్ చేస్తున్నారు
  • కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది
  • ముద్రగడకు పనేమీ లేకనే లేఖలు రాస్తున్నారు  

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ2 నిందితుడు అయిన విజయసాయిరెడ్డి చంద్రబాబునాయుడిని దొంగ అని అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. విజయసాయిరెడ్డిని అడ్డుపెట్టుకుని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)లో జగన్ లాబీయింగ్ చేస్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపైనా ఆయన మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ముద్రగడకు పనేమీ లేకనే లేఖలు రాస్తున్నారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా నైతే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారో, కాపుల విషయంలోనూ అదే విధంగా ఆయన మాట్లాడుతున్నారని అన్నారు.

Chandrababu
Vijay Sai Reddy
china rajappa
  • Loading...

More Telugu News