amit shah: నోరు జారిన అమిత్ షా!.. వీడియో చూడండి

  • యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్న అమిత్ షా
  • క్షణాల్లో వీడియోను వైరల్ చేసిన కాంగ్రెస్
  • షా నిజాలు మాట్లాడారన్న సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన తరుణంలో బీజేపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు కాంగ్రెస్ కు తిరుగులేని ఆయుధంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై చేసిన ఆరోపణలను తిప్పి కొట్టే క్రమంలో అమిత్ షా ఈరోజు కర్ణాటకలోని దావణగెరేలో మీడియాతో మాట్లాడుతూ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్పను అవినీతిపరుడిగా పేర్కొన్నారు.

ఈ మధ్యే సుప్రీంకోర్టుకు చెందిన ఓ రిటైర్డు జడ్జి దేశంలో పేరుకుపోయిన అవినీతి గురించి మాట్లాడుతూ, ఇప్పటిదాకా తాను గమనించిన ప్రభుత్వాల్లో అత్యంత అవినీతికరమైన ప్రభుత్వం యెడ్యూరప్పదే అని చెప్పారని షా తెలిపారు. అదే సమయంలో అమిత్ షా పక్కనే యెడ్యూరప్ప కూడా కూర్చున్నారు. షా మాటలతో యెడ్డీ కంగుతిన్నారు. వెంటనే పక్కనే ఉన్న మరో నేత షా చెవిలో ఏదో చెప్పారు. దీంతో, చేసిన పొరపాటును గ్రహించిన అమిత్ షా... యెడ్యూరప్ప కాదు, సిద్ధరామయ్య అని సవరించుకున్నారు.

కానీ, అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. షా మాటలను కాంగ్రెస్ ఆయుధంగా మలుచుకుంది. అమిత్ షా మాటలను క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. అంతేకాదు... 'ఎట్టకేలకు చివరకు షా నిజాలు మాట్లాడారు' అంటూ సందేశాన్ని కూడా జత చేశారు. అమిత్ షా చేసిన పొరపాటు ఇప్పుడు బీజేపీని ఇరకాటంలోకి నెట్టేసింది.

amit shah
yeddyurappa
sudharamaiah
corruption
video
  • Error fetching data: Network response was not ok

More Telugu News