Vijay Sai Reddy: చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి

  • చార్లెస్ శోభరాజ్ ను మించిన గజదొంగ చంద్రబాబు
  • ఒక తల్లి, తండ్రికి పుట్టినవారెవరూ చంద్రబాబులా మాట్లాడరు
  • విజయ్ మాల్యాతో నన్ను ఎలా పోలుస్తారు?

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదా పడిన అనంతరం... పార్లమెంటు ఆవరణలో ఆయన మాట్లాడుతూ సహనం కోల్పోయారు. తనను గజ దొంగ అని చంద్రబాబు అంటున్నారని... అంతర్జాతీయ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ను మించిన గజదొంగ చంద్రబాబు అని విమర్శించారు.

ఒక తల్లి, తండ్రికి పుట్టినవారెవరూ చంద్రబాబులా మాట్లాడరంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాతో తనను ఎలా పోలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క బ్యాంకు నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని అన్నారు. ఎంపీ సుజనా చౌదరి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని... రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారని చెప్పారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్ లను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

Vijay Sai Reddy
Chandrababu
Sujana Chowdary
vijay mallya
charles sobharaj
  • Loading...

More Telugu News